Bats are like neighbour's wife': Dinesh Karthik leaves fans stumped with his commentary on ENG vs SL 2nd ODI
#DineshKarthik
#EngVssl
#IndVsEng
#WorldTestChampionship
ఇటీవలే కామెంటేటర్‌గా అవతారమెత్తి అందరిచేత శభాష్ అనిపించుకున్న టీమిండియా వెటరన్ క్రికెట్ దినేశ్ కార్తీక్ వివాదంలో చిక్కుకున్నాడు. భారత్- న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌తో కామెంట్రీ షురూ చేసిన ఈ తమిళనాడు క్రికెటర్.. తనదైన వ్యాఖ్యానంతో అందర్ని ఆకట్టుకున్నాడు. సరదా జోకులు, సహచరులపై పంచ్‌లు విసురుతూ దిగ్గజ వ్యాఖ్యతల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. అలాంటి దినేశ్ కార్తీక్ తాజాగా మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డాడు. ఇంగ్లండ్, శ్రీలంక మధ్య గురువారం జరిగిన రెండో వన్డే సందర్భంగా దినేశ్ కార్తీక్ చేసిన వ్యాఖ్యనంపై సోషల్ మీడియా వేదికగా దుమారం రేగుతోంది.